కడప : శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి జయంతి సందర్భంగా సోమవారం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ అధ్యక్షులు కళ్యా సుధాకర్, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ చౌడేశ్వరి దేవాలయం వద్ద ప్రజలకు, భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ ఉపాధ్యక్షులు కొరముట్ల సుబ్బరాయుడు, వీర క్షత్రియ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి సుంకర రామచంద్రుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లా నరసింహారావు, కోశాధికారి టేకూరి సుదర్శన్, వెలిగండ్ల సుబ్బరాయుడు, అన్నం శంకర్, పల్లా బాలచౌడన్న, బండి కష్ణ య్య, కాల్వ వాగేష్ ఇడెం సురేంద్ర, టేకూరి పుష్పాంగధ గుర్రం నటరాజ్, ఇడెం రామమునెయ్య ఆలయ కమిటీ సభ్యులు, సంఘం నాయకులు, శ్రీ చౌడేశ్వరి దేవి భక్తులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఘనంగా జయంతి వేడుకలు.. కడప నగరంలోని శ్రీ విజయ దుర్గ కాలనీ పార్కులో శ్రీ చౌడేశ్వరి దేవి జయంతి వేడుకలు పురస్కరించుకొని కాలనీ మహిళలు అందరూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు తీర్థ ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో కాలనీవాసులు గోవిందు నాగరాజు, సంగినాదం ఆంజనేయులు, సిఆర్‌ఐ వెంకట లక్ష్మమ్మ, గోవిందు వెంకటసుబ్బమ్మ, అరుణ నారాయణమ్మ, అమ్మవారి భక్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. చెన్నూరు : శ్రీ చౌడేశ్వరి దేవి అమ్మవారి 94వ జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహించినారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. కమలాపురం శాసనసభ్యులు పోచం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాన్ని అందుకున్నారు కార్యక్రమంలో మండల వైసీపీ కన్వీనర్ జీన్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ చీర్ల. సురేష్ యాదవ, చెన్నూరు టౌన్ కన్వీనర్ ముదిరెడ్డి సుబ్బారెడ్డి, అల్లి శ్రీరామ్మూర్తి, విజరు కుమార్ పాల్గొన్నారు.
ఫిర్యాదులపై సత్వరం స్పందించాలి
ప్రజాశక్తి - కడప అర్బన్
జిల్లాలో బాధితులు పోలీసు శాఖకు ఇచ్చే ఫిర్యాదుల పట్ల సత్వరం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని ఎస్‌పి కే.కే.ఎన్.అన్బురాజన్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో 'స్పందన' కార్యక్రమం నిర్వహించారు. బాధితులతో స్వయంగా మాట్లాడి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారి సమస్యలను తెలుసుకున్నారు. 'స్పందన' ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, నిర్ణీత సమయంలో వాటిని పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు.










