Nov 17,2022 23:27

గాజువాకలో మ్యాథ్స్‌క్లబ్‌లో ప్రిన్సిపల్‌ అరుణకుమారి, టీచర్లు

ప్రజాశక్తి -గాజువాక : గాజువాక చైతన్యనగర్‌లోని శ్రీచైతన్య పాఠశాలలో మాథ్స్‌ క్లబ్‌ను పాఠశాల హెచ్‌ఎం అరుణకుమారి ప్రారంభించారు. విద్యార్థులు స్వయంగా రూపొందించిన మ్యాథ్స్‌ నమూనాలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం మాట్లాడుతూ, గణిత మేథావి రామానుజన్‌ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జిలు విజయ, మీనాక్షిం,రాధిక, ఎజిఎం సురేష్‌, ఆర్‌ఐ రమణ పాల్గొన్నారు.
పిఎం.పాలెం : మధురవాడ బక్కన్నపాలెం రోడ్డులోని శ్రీ చైతన్య ఇంగ్లీష్‌ మీడియం పాఠశాలలో మ్యాథ్స్‌ క్లబ్‌ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు రూపొందించిన గణిత నమూనాలు అందరిని ఆకట్టుకున్నాయి. విద్యార్థులలో దాగివున్న అంతర్గత నైపుణ్యాలను వెలికితీసేందుకు ఇటువంటి ప్రక్రియలు దోహదపడతాయని పాఠశాల ప్రిన్సిపల్‌ సందీప్‌ అన్నారు.ఈ సందర్భంగా. విద్యార్థులకు జట్టు కృత్యాలు, క్విజ్‌ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి ఉత్తరాంధ్ర జిల్లాల శ్రీ చైతన్య పాఠశాలల ఎజిఎం సురేష్‌, రీజనల్‌ ఇన్‌ఛార్జి ్జ అహ్మద్‌ అలీ, వైస్‌ ప్రిన్సిపల్‌ ఉమామహేశ్వరరావు, డీన్‌ ఢిల్లేశ్వరరావు, సీ బ్యాచ్‌ ఇన్‌ఛార్జి జగదీష్‌ పాల్గొన్నారు.