శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రెగ్యులర్ విసిగా ఆచార్య రాణీ సదాశివమూర్తి
శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రెగ్యులర్ విసిగా ఆచార్య రాణీ సదాశివమూర్తి
ప్రజాశక్తి - క్యాంపస్ : శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పూర్తిస్థాయి (రెగ్యులర్) ఉప కులపతిగా ప్రొఫెసర్ రాణీ సదాశివ మూర్తిని విశ్వవిద్యాలయ చాన్సులర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నియమించారు. ఈ మేరకు బుధవారం విశ్వవిద్యాలయ పరిపాలన భవనంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సదాశివ మూర్తి మాట్లాడుతూ ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ధన్యవాదాలు తెలిపారు. విశ్వవిద్యాలయ అభివద్ధి చేస్తానన్నారు. అవకాశం ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వాహణాధికారి ఏవి ధర్మారెడ్డికి, పాలకమండలి అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థుల అభివద్ధికి, వారికి కావలసిన సౌకర్యాలు మెరుగుపరుస్తానని తెలిపారు. విశ్వ విద్యాలయ ప్రధాన లక్ష్యాలైన అధ్యయనం, బోధన, ప్రచు రణ, పరిశోధన అను అంశాలపై ప్రధానంగా దష్టి సారిస్తానని వెల్లడించారు. ఈ కార్యక్ర మంలో రిజిస్ట్రార్ డాక్టర్ ఏవి రాధేశ్యమ్, అకడమిక్ డీన్ గోళి సుబ్రహ్మణ్య శర్మ, ఫైనాన్స్ ఆఫీసర్ అంజిరెడ్డి, పీఆర్వో డాక్టర్ టి బ్రహ్మాచార్యులు, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.










