ప్రజాశక్తి-వన్‌టౌన్: శ్రీ శుభకత్ నామ సంవత్సర మాఘ శుద్ధ పంచమి సందర్బంగా గురువారం ప్రధాన ఆలయంలోని శ్రీ కనకదుర్గమ్మ, కొండపైన చిన్నరాజగోపురం వద్ద గల శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి మందిరం వద్ద ఏర్పాటు చేసిన ఉత్సవమూర్తిని సరస్వతీ దేవిగా అలంకరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఒక కలం, అమ్మవారి ఫొటో, రక్షాకంకణం, కుంకుమ, లడ్డు బూందీ ప్రసాదం ఉచితంగా అందజేశారు. విద్యార్ధులకు ఉచిత క్యూలైన్లు ద్వారా ముఖ మండపం దర్శనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఇఒ దర్భముళ్ల భ్రమరాంబ, కె.వి.ఎస్ కోటేశ్వరరావు, ఎల్.రమాదేవి, పి.చంద్రశేఖర్, పి.సుధారాణి, ఎన్.రమేష్, బి.వెంకటరెడ్డి, రాజేంద్ర పాల్గొన్నారు.










