ప్రజాశక్తి - కొల్లూరు
స్థానిక శ్రీ సాయి వాసవి విద్యానికేతన్‌లో కొల్లూరు డాక్టర్ కృష్ణంరాజు హాస్పిటల్, గుంటూరు నట రాజ్ హాస్పటల్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంపును నిర్వహించారు. శ్రీ సాయి వాసవి విద్యార్థులు 550మంది, కొల్లూరు గ్రామస్తులు 150మందికి వైద్యరీక్షలు చేశారు. డాక్టర్లు పి నటరాజ్, డాక్టర్ ఎస్‌కె వాలి, డాక్టర్ టి ప్రవీణ్, డాక్టర్ కృష్ణం రాజు వైద్యపరీక్షలు చేశారు.










