Oct 26,2023 23:46

పొన్నూరు రూరల్‌: ఖరీఫ్‌ సీజన్‌ మధ్యలోనే వ్యవసాయానికి సాగు నీరు అందక పోవడం ప్రభుత్వ అనాలోచిత పాలనను తెలియజేస్తుందని రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షేక్‌ మస్తాన్‌ వలి విమర్శించారు.రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జక్కా శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో గురువారం పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని కట్టెంపూడి, తాళ్లపాలెం గ్రామాలను సందర్శించిన ఆయన సందర్శించారు. సాగునీరందక ఎండుతున్న వరి, జామ, బొప్పాయి పొలాలను సందర్శించి, రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా షేక్‌ మస్తాన్‌ వలి మాట్లాడుతూ శ్రీ రంగపురం ఆయకట్టుకు నీరందించి, ఎండుతున్న పైరులను కాపాడాలని, రైతులను, ముఖ్యంగా కౌలు రైతులను ఆదుకోవాలని అన్నారు. జక్కా శ్రీనివాస్‌ మాట్లాడుతూ శ్రీ రంగపురం ఛానల్‌ రైతులు ఎదుర్కుంటున్న నీటి కొరతను తీర్చి, రైతాంగాన్ని ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో గుం టూరు జిల్లా అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు, మంగళగిరి ఇంచార్జి షేక్‌ సలీం, పొన్నూరు మండల కాం గ్రెస్‌ అధ్యక్షులు చలికొండ రవిబాబు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్య క్షులు కూరపాటి సతీష్‌, చేబ్రోలు మండల పార్టీ అధ్యక్షులు మండలనేని కోటయ్య , యువజన కాంగ్రెస్‌ నాయకులు కాలేషా, ఫణి, రేవంత్‌ తదితరులు పాల్గొన్నారు.