ప్రజాశక్తి - పెద్దాపురం స్థానిక రామారావుపేటలోని శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో ఆదివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాస్థాయి స్విమ్మింగ్ పోటీలు ఉత్సాహపూరిత వాతావరణంలో ప్రశాంతంగా జరిగాయి. కాకినాడ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ స్విమ్మింగ్ పోటీల్లో సుమారు వందమంది బాల, బాలికలు ఉత్సాహంగా పాల్గొన్నారు. 56 కేటగిరీల్లో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ముఖ్య అతిథులుగా శ్రీప్రకాష్ స్కూల్ డైరెక్టర్ సిహెచ్.విజరు ప్రకాష్, స్విమ్మింగ్ అసోసియేషన్ కాకినాడ జిల్లా అధ్యక్షులు పెద్దిరెడ్డి సతీష్, అసోసియేషన్ సెక్రటరీ ఇరుసుమళ్ల రాజు, స్విమ్మింగ్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు మంగా వెంకట శివరామకృష్ణ పాల్గొన్నారు. ఈ పోటీలకు కోచ్‌లుగా శ్రీహరి, పి.నాని, ఎం.అజరు కుమార్, వి.వీరభద్రయ్య, ఐ.వీరబాబు వ్యవహరించారు. పోటీలు ముగిసిన అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.










