గౌరవ వందనం స్వీకరిస్తున్న సిఐ
ప్రజాశక్తి -పాయకరావుపేట: శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల అనుబంధం సంస్థ డిగ్రీ కాలేజ్‌లో ఎన్‌సిసి డే ఉత్సవాలను ఘనంగా ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పాయకరావుపేట సిఐ అప్పలరాజు ఎన్సిసి విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్సీసీ విద్యార్థుల్లో పూర్తిస్థాయి క్రమశిక్షణ ఉంటుందని, కాలేజీ దశలో ఎన్సిసి వారి భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వీర్రాజు, భానుమూర్తి తదితరులు పాల్గొన్నారు.










