Aug 01,2023 00:04
శ్రీ ప్రకాష్‌ విద్యార్థుల ప్రతిభ

ప్రజాశక్తి-పాయకరావుపేట:విశాఖ యోగా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 30న సీతమ్మధార కృష్ణా మందిర్‌ (విశాఖ)లో జరిగిన విశాఖపట్నం డిస్ట్రిక్ట్‌ యోగా ఛాంపియన్షిప్‌ 2023 పోటీల్లో స్థానిక శ్రీ ప్రకాష్‌ విద్యార్థులు 8 మంది ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సెప్టెంబర్‌ 10న కర్నూలులో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలకు యోగా పోటీలకు ఎంపికయ్యారని విద్యా సంస్థల సీనియర్‌ ప్రిన్సిపల్‌ ఎం.వి.వి.ఎస్‌ మూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యా సంస్థల అధినేత సి.హెచ్‌.వి.కె నరసింహారావు, సంయుక్త కార్యదర్శి విజరు ప్రకాష్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ అపర్ణ, అకడమిక్‌ ఇంచార్జిలు కె.లక్ష్మీ నీళాదేవి, సంధ్యారాణి, యోగా గురువు సురేష్‌ తదితరులు అభినందించారు.