
ప్రజాశక్తి - వన్‌టౌన్ : దసరా శరన్నవరాత్రుల సందర్భంగా స్థానిక చిట్టినగర్‌లోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో బుధవారం సుమారు ఆరువేల మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది. జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ నగరాల సీతారామస్వామి శ్రీ మహాలక్ష్మి అమ్మవార్ల దేవస్థానం కమిటీ అధ్యక్షులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్ళా శ్రీనివాసరావు, గౌరవ అధ్యక్షులు బెవర సూర్యనారాయణ మాట్లాడుతూ దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులకు అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. దేవస్థానం ప్రాంగణంలోని కళావేదికపై నిత్యం సాయంత్రం వేళల్లో నిర్వహించిన సాంస్కతిక కార్యక్రమాలకు భక్తుల నుండి మంచి స్పందన లభించిందన్నారు. కాగా అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో దేవస్థానం పాలక మండలి ఉపాధ్యక్షులు మరుపిళ్ళ సత్యనారాయణ, బెవర శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శులు పొట్నూరి దుర్గాప్రసాద్, శీరం వెంకట్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కొరగంజి భాస్కరరావు, కార్యవర్గ సభ్యులు పోతిన బేసి కంటేశ్వరుడు, మజ్జి ఈశ్వరరావు, మజ్జి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.