Aug 15,2023 20:29

వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు

ప్రజాశక్తి -పొదలకూరు : స్థానిక శ్రీ గాయత్రి విద్యామందిర్‌ లో మంగళవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కరస్పాండెంట్‌ చైతన్య కుమార్‌ రెడ్డి జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం విద్యార్ధులను ఉద్దేశించి మాట్లాడుతూ స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రం తర్వాత భారతదేశ స్థితిగతుల గురించి వివరించారు. అనంతరం పలువురు ఉపాధ్యాయులు దేశభక్తి నాయకుల జీవిత చరిత్ర, వారి త్యాగాల గురించి వివరించారు. విద్యార్ధులకు వ్యాస రచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. చిన్నారులు దేశభక్తి నాయకుల వేషధారణలో అలరించారు. సాంస్కతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ చంద్రబాబు, ఏడుకొండలు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.