ప్రజాశక్తి- ఆనందపురం : అనందపురం భీమిలి క్రాస్ రోడ్ సమీపంలో ఉన్న శ్రీ చైతన్య జెఇఇ కళాశాలలో విద్యార్థులు తీవ్రంగా కొట్టుకున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థుల మధ్య రూము మారే విషయంలో వివాదం ప్రారంభమైంది. అందులో కొంతమంది విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. వారిలో పడాల సాయి, ఆర్నెపల్లి హరీష్, కాకర్ల చందు, కళ్లికొట్ట అజరు, తెలంగాణ బాలు ఒక గ్రూపు గాను, బొబ్బిలి మోహన్, జడల జయప్రకాష్, పిట్ట కోటేశ్వరరావు, కౌశిక్, మోహన్ మరో గ్రూపుగానూ ఏర్పడి రూము మారే విషయంలో గొడవపడ్డారు. శనివారం రాత్రి ఆరు గంటల సమయంలో కళాశాల ప్రిన్సిపల్ కిరణ్ క్రాంతి విషయం తెలుసుకొని విద్యార్థులకు సర్ది చెప్పి పంపించారు. రాత్రి 11:30 గంటల సమయంలో రెండు గ్రూపుల విద్యార్థులు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారు ఉజ్వల హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వీరిలో జడల జయప్రకాష్‌కు తీవ్ర గాయాలయ్యాయి.