క్రీడా జ్యోతితో ఆర్‌ఐ, ప్రిన్సిపల్ తదితరులు
శ్రీ చైతన్యలో ఘనంగా క్రీడా దినోత్సవం
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో మంగళవారం క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ చైతన్య పాఠశాలల ఎజిఎం సురేష్, ఆర్‌ఐ రామాంజనేయులు హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ మంజుల మాట్లాడుతూ పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంచాలన్నారు. క్రీడల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, విద్యార్థులు మానసికంగా, శారీరంగా దృఢంగా ఉంటారని తెలిపారు. అనంతరం విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్, నృత్యాలు, వినాస్యాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఎఒ పరమేశ్వర రెడ్డి, డీన్ రాజేష్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.










