
ప్రజాశక్తి-కందుకూరు :దేశవ్యాప్తంగా గత నెలలో జరిగిన నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ (కెఎటి) 2023 ఒలంపియాడ్ పరీక్షా ఫలితాల్లో కందుకూరు శ్రీ చైతన్య విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. పట్టణంలోని కోటారెడ్డి నగర్‌లోని శ్రీ చైతన్య హైస్కూల్ ఆవరణంలో అభినందన సభ మంగళవారం జరిగింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుచున్న విద్యార్థులు పరీక్షలు రాయగా అందులో 36 మంది విద్యార్థులు రెండో దశకు అర్హత సాధించి రికార్డు సష్టించారని స్కూలు ప్రిన్సిపాల్ బొడ్డు సురేష్ తెలిపారు. మ్యాథ్స్ అసెస్మెంట్ టెస్ట్ లో 11మంది, ఫిజిక్స్ అసెస్మెంట్ టెస్ట్ లో 10 మంది,కెమెస్ట్రీ అసెస్మెంట్ టెస్ట్ లో 15 మంది చొప్పున 36 మంది విద్యార్థులు రెండో దశకు అర్హత సాధించారన్నారు. ఉత్తమ పతిభ కనపరచిన విద్యార్థులను ఎజిఎం అంజయ్య , అర్‌ఐ అనిల్, కోఆర్డినేటర్ శ్రీనివాసులు , సి బ్యాచ్ ఇంచార్జ్ , డీన్ బ్రహ్మయ్య, ఉపాధ్యాయులు అభినందించారు.