Aug 18,2023 18:31

జనరల్‌ ఎలక్షన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ప్రిన్సిపల్‌ మంజుల, విద్యార్థులు

ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌
కర్నూల్‌ నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో శుక్రవారం జనరల్‌ ఎలక్షన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాలల ఏజీఎం సురేష్‌ హాజరై మాట్లాడారు. విద్యార్థులు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కేవలం చదువులోనే కాకుండా అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు. మంచి దేశ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రామాంజనేయులు, అకాడమిక్‌ కోఆర్డినేటర్‌ నాగేశ్వరరావు, ప్రిన్సిపల్‌ మంజుల, ఏవో పరమేశ్వర్‌ రెడ్డి, డి రాజేష్‌, ప్రైమరీ ఇన్చార్జులు రోజా, సుజాత, రాణి, అధ్యాపక బందం, విద్యార్థులు పాల్గొన్నారు.