Jul 22,2023 16:28

శ్రీ చైతన్య పాఠశాల విద్యార్థుల ప్రదర్శన, మొక్కలు నాటుతున్న ఆర్‌ఐ రామాంజనేయులు, ప్రిన్సిపల్‌ మంజుల, వైస్‌ ప్రిన్సిపల్‌ పరమేశ్వర రెడ్డి, డీన్‌ రాజేష్‌ తదితరులు

శ్రీ చైతన్య పాఠశాలలో హరిత భారత్‌ కార్యక్రమం
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్‌

      కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో శనివారం హరిత భారత్‌ కార్యక్రమం జరిగింది. శ్రీ చైతన్య విద్యా సంస్థలు నిర్వహించే 'స్మార్ట్‌ లివింగ్‌ ప్రోగ్రామ్‌'లో భాగంగా కర్నూలు బ్రాంచ్‌లో పాఠశాలల ఎజిఎం సురేష్‌ విద్యార్థులతో ప్రదర్శన కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు హరిత భారత్‌పై నినాదాలు చేస్తూ ప్రదర్శనగా వెళ్లారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమాన్ని పాఠశాల ఆర్‌ఐ రామాంజనేయులు, ప్రిన్సిపల్‌ మంజుల, వైస్‌ ప్రిన్సిపల్‌ పరమేశ్వర రెడ్డి, డీన్‌ రాజేష్‌లు ప్రారంభించి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.