శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా మాతృభాష, క్రీడా దినోత్సవాలు
ప్రజాశక్తి - కర్నూలు కలెక్టరేట్
కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో మంగళవారం గిడుగు రామ్మూర్తి, ధ్యాన్‌చంద్ జయంతిని పురస్కరించుకుని మాతృభాష, క్రీడా దినోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాలల ఎజిఎం సురేష్ హాజరై మాట్లాడారు. తెలుగు భాష విశిష్టత, ఔన్నత్యాన్ని వివరించారు. విద్యార్థులకు చదువుతో పాటు ఆటల్లోనూ ప్రవేశం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి విద్యార్థి క్రీడా స్ఫూర్తిని కలిగి ఉండాలని వివరించారు. అనంతరం విద్యార్థినీ విద్యార్థులు అమ్మభాష గురించి ఆట పాటలతో, పొడుపు కథలతో, జానపద నృత్యాలతో అలంరించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఐ రామాంజనేయులు, కోఆర్డినేటర పి.నాగేశ్వర రావు, ప్రిన్సిపల్ మంజుల, ఎఒ పరమేశ్వర రెడ్డి, డీన్ రాజేష్, ప్రైమరీ ఇన్‌ఛార్జులు రాణి, సుజాత, రోజా, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.











