Jul 12,2023 23:33

హాజరైన ఇరు రాష్ట్రాల అధికారులు

ప్రజాశక్తి-డుంబ్రిగుడ:
ఆంధ్ర ఒడిస్సా సరిహద్దు నిర్ణయంపై మండలంలోని రాయపాడులోని బుధవారం ఆంధ్ర ఒడిస్సా అధికారులు సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సరిహద్దు నిర్ణయం పై చర్చించినట్లు సబ్‌ ఇన్స్పెక్టర్‌ సంతోష్‌ కుమార్‌ తెలిపారు. ఈ మేరకు స్థానిక విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. ఈ సరిహద్దు సమావేశానికి తహసిల్దార్‌ సిహెచ్‌ నాగమ్మ, హెచ్‌డిటి ముజీబ్‌, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు కిముడు హరి, వైస్‌ ఎంపీపీ శెట్టి ఆనందరావు, అటవీ శాఖ అధికారులు హాజరు కాగా ఒడిశా కోరాపుట్‌ సబ్‌ కలెక్టర్‌. నందాపూర్‌ ఎస్‌డిపిఓ, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారులు హాజరైనట్లు చెప్పారు.