
కొల్లిపర: రైతులు పండించిన సేంద్రీయ పంటలను ఆహార ఉత్ప త్తులుగా చేసి ప్రజలకు విక్రయించడం శుభపరిణామం అని ఆచార్య ఎన్‌జి రంగావ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సం చాలకులు డాక్టర్ అన్యం సుబ్బరామిరెడ్డి అన్నారు. మంగళ వారం మండల కేంద్రమైన కొలిపరలో శ్రేష్ట రైతు ఉత్పత్తిదారుల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రేష్ట స్మార్ట్ స్టోర్‌ను శాసనసభ్యులు అన్నా బత్తుని శివకుమార్ తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లిపరలో 300 మంది రైతులు సంఘటితంగా ఏర్పడి సంస్థను ఏర్పాటు చేసుకొని పండించిన పంట లను ఆహార ఉత్పత్తులుగా తయారు చేసుకొని వాటిని నేరుగా వినియోగదారులకు అమ్మడం ద్వారా ఆదాయం పొందు తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు సం ఘటితంగా ఏర్పడి సంస్థలను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సి డీపై రుణాలను ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిసోందని చెప్పారు. కార్యక్రమంలో శ్రేష్ట చైర్మన్ ఎన్.కుటుంబరెడ్డి, ఎన్. నరేంద్రారెడ్డి, కె.వీరారెడ్డి, యు.సాంబిరెడ్డి పాల్గొన్నారు.