Apr 19,2023 23:59

గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాల వేస్తున్న లక్ష్మి తదితరులు

ప్రజాశక్తి-పరవాడ
సర్దార్‌ గౌతు లచ్చన్న 17వ వర్థంతి కార్యక్రమం మండలంలోని గొర్లివానిపాలెం పంచాయతీ పరిధి గౌతు లచ్చన్న నగర్‌ కూడలిలో స్వర్ణాంధ్ర మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కోఆపరేటివ్‌ హౌసింగ్‌ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. పెందుర్తి శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్‌ రాజ్‌ ముఖ్య అతిథిగా విచ్చేసి గౌతు లచ్చన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి పిఎస్‌.రాజు, గొర్లివానిపాలెం సర్పంచ్‌ గొర్లి గోపి అమ్మలు, ఎంపీటీసీ గొర్లి వరలక్ష్మి ఎరుకు నాయుడు, మాజీ సర్పంచ్‌ గొర్లి కనకారావు, ఈ బోనింగ్‌ ఉప సర్పంచ్‌ బుగిడి రామ గోవింద, బర్నికం సర్పంచ్‌ పెద్దిరెడ్డి పూజ రాజశేఖర్‌, సొసైటీ అధ్యక్షులు జిఎస్‌ నాయుడు, రేలంగి ధనరాజు, నారాయణ, కృష్ణమూర్తి, పైల అప్పారావు, బుగిడి రమణ, పైల రాధాకృష్ణ, కరగాని సూరిబాబు, పైల ప్రశాంత్‌, పోలిరెడ్డి వెంకట్రావు, రాయవరపు సన్యాసిరావు పాల్గొన్నారు.
అనకాపల్లి : బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సర్దార్‌ గౌతు లచ్చన్న విశేష కృషి చేశారని అనకాపల్లి బీసీ సంఘం నాయకులు విత్తనాల పోతురాజు అన్నారు. స్థానిక సిపిఐ కార్యాలయంలో బుధవారం జరిగిన లచ్చన్న 17వ వర్ధంతి కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లాకు సర్దార్‌ గౌతు లచ్చన్న పేరు పెట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు ఎస్‌ సత్యనారాయణ, జి వెంకటేశ్వర్లు, దేవుడు బాబు, జిఎస్‌ నారాయణ, కోన శ్రీను, కొల్లి సత్యారావు, కోన లక్ష్మణ, మత్తుర్తి సూరిబాబు పాల్గొన్నారు.
గాజువాక : బడుగుబలహీన వర్గాల ఆశాజ్యోతి సర్ధార్‌ గౌతు లచ్చన్న ఎపి స్టేట్‌ యాత కార్పొరేషన్‌ డైరెక్టర్‌, న్యాయవాది అండిబోయిన లక్ష్మి అన్నారు. బుధవారం గౌతు లచ్చన్న 17వ వర్థంతి సందర్భంగా వడ్లపూడి గ్రామంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బ్రిటీషర్లకు వ్యతిరేకంగాస్వాతంత్య్ర పోరాటంలోనూ, విదేశీ వస్తు బహిష్కరణ వంటి ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని జైలుకు వెళ్లి వచ్చిన వ్యక్తి గౌతు లచ్చన్న అన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యాత శెట్టిబలిజ గౌడ ఈడిగ శ్రీశైల సంక్షేమ సంఘం అధ్యక్షులు అండిబోయిన అప్పారావు, కణితి కాలనీ రథాలమ్మ సంఘం ప్రతినిధి పోతల కృష్ణ, యాత సంఘం సభ్యులు నెల్లి సాధూరావు, దొమ్మేటి రమణారావు, ఎలమంచిలి మంగరాజు, గోవింద గౌడ్‌, నడిగట్ల గురుమూర్తి, కడవల నాయుడు పోలవరపు రమణబాబు పాల్గొన్నారు