ఏలూరు అర్బన్: సర్ సిఆర్ రెడ్డి అటానమస్ కళాశాల జంతుశాస్త్ర విభాగంలో గత దశాబ్ధ కాలంగా అధ్యాపకులుగా పనిచేస్తున్న మరీదు నవీన్ కుమార్ ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. ఏలూరు సమీపంలోని 'కొల్లేరు నీటిలో, మట్టిలో, కొరమేను చేపలో భారలోహాల కాలుష్య తీవ్రత, దాని పర్యవసానాలపై శాస్త్రీయమైన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా కళాశాల యాజమాన్యం మంగళవారం ఎం.నవీన్ కుమార్ ను అభినందించి సన్మానించారు.