
ప్రజాశక్తి - ఉండి
విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్ది వారిలో పోటీతత్వాన్ని అలవర్చేందుకే స్ఫూర్తి సంస్థ ప్రతిభా పురస్కారాలను అందిస్తుందని ఎన్‌ఆర్‌పి అగ్రహారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముక్కు వెంకట సత్యనారాయణ అన్నారు. పాఠశాలలో ముక్కు వెంకట సత్యనారాయణ అధ్యక్షతన సోమవారం నిర్వహించిన సమావేశంలో గతేడాది పదో తరగతిలో మెరుగైన ఫలితాలను సాధించిన విద్యార్థులకు స్ఫూర్తి ప్రతిభా పురస్కారాలను అందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ముక్కు వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ పదో తరగతిలో ప్రతిభ కనబరచి పాఠశాల స్థాయిలో ప్రథమ ద్వితీయ స్థానం సాధించిన తెలుగు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.2 వేలు, రూ.1500 అందించినట్లు చెప్పారు. మండలంలోని ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని ఎ.మేరీరత్నం, తెలుగు మీడియం విద్యార్థిని యు.హర్షిత, ఎన్‌ఆర్‌పి అగ్రహారం పాఠశాల విద్యార్థి కె.ఆగేష్‌లకు ప్రోత్సాహాక బహుమతిగా రూ.ఐదు వేలు అందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఇఒ-1 బొల్లిపో జ్యోతి, ఎంఇఒ-2 బి.వినాయకుడు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కృష్ణంరాజు, చక్రవర్తి, రవీంద్ర, రామలక్ష్మి, రత్నకుమార్, ఉపాధ్యాయులు సుబ్బరాజు, సునీల్‌కుమార్, చాముండేశ్వరి, విద్యార్థులు పాల్గొన్నారు.