Feb 20,2023 23:53

మాట్లాడుతున్న మోపిదేవి వెంకట రమణారావు

ప్రజాశక్తి- రేపల్లె :  రేపల్లె మండలం ఉప్పూడి పంచాయతీ పరిధిలోని ఊలుపాలెంలో ఏర్పాటు చేసిన భారత మాజీ ఉప ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి దివంగత బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్ర హాన్ని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకట రమణా రావు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోపిదేవి వెంకట రమణారావు మాట్లాడుతూ అణగారిన వర్గాల ప్రతినిధిగా, ఉప ప్రధానిగా, రక్షణ మంత్రిగా పదవులకు వన్నెతెచ్చిన స్ఫూర్తిదాయకమైన నాయకుడు బాబు జగ్జీవన్‌రామ్‌ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విగ్రహ దాత అల్లం శెట్టి నరేష్‌ బాబు, ఎంపిటిసి అల్లం శెట్టి సతీష్‌ బాబు, సర్పంచి గుజ్జర్లమూడి విజయ బేబి, ఇమ్మానియేల్‌ భాస్కర్‌, ఎన్‌.కిషోర్‌, పి.సురేష్‌ బాబు, రాజేశ్వరరావు, జయరావు, హరీష్‌ బాబు, నీలాంబరం గ్రామ పెద్దలు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.