కరోనా కారణంగా పాఠశాలలు ఇంకా తెరచుకోలేదు. దీంతో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు సప్తగిరి దూరదర్శన్ ద్వారా ఆన్‌లైన్ బోధన చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దూరదర్శన్ చానల్ ద్వారా ఈ ఆన్‌లైన్ బోధనకు షెడ్యూలు కూడా ఇచ్చారు. జులై 12 నుంచి పాఠాలు ప్రసారం కావాల్సి వుంది. కానీ ఇంతవరకు ఆరంభం కాలేదు. ఒకవైపు పురపాలక పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 5వ తేదీ నుంచి ఆన్‌లైన్ బోధన ప్రారంభం అయింది. అలాగే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు చాలా రోజుల నుంచే ఆన్‌లైన్ బోధన చేస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఎప్పటి నుంచి దూరదర్శన్ పాఠాలు వుంటాయో తెలియక విద్యార్థులు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా శ్రద్ధ తీసుకుని క్లాసులు ఆరంభించాలి.
- ఉప్పలపు శేషునాథ్,
పి. నైనవరం గ్రామం, కృష్ణా జిల్లా.










