ప్రజాశక్తి-పద్మనాభం : మండలంలోని స్ప్రింగ్‌ఫీల్డు పాఠశాలలో ఫీజులు అధికంగా వసూలు చేస్తున్నట్లు తమ తనిఖీలో స్పష్టమైందని ఇన్‌ఛార్జి ఎంఇఒ పద్మావతి, ఎంపిడిఒ నిర్మలాదేవి తెలిపారు. బుధవారం పాఠశాలను సందర్శించారు. తరగతులకు సరిపడా ఉపాధ్యాయులు లేరని, ముగ్గురు పిఇటిలు అవసరం కాగా, ఇద్దరే ఉన్నారన్నారు. విద్యార్థుల నుంచి రెట్టింపు కంటే అధికంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, బస్‌ఛార్జీలు ఎక్కువగానే గుంజుతున్నారని, కిలోమీటర్‌కు ఎంత వసూలు చేస్తున్నారని ప్రశ్నిస్తే సమాచారం లేదన్నారు. ఫైర్ సేఫ్టీ సౌకర్యం లేదని, రికార్డులన్నీ అసంపూర్తిగా ఉన్నాయన్నారు. ల్యాబ్‌ల్లోని పరికరాలు బాగా లేనందున కొత్త ల్యాబ్ ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలలోని పరిస్థితులపై డిఇఒకు నివేదిస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కె రాంబాబు ఉన్నారు.










