Dec 04,2022 00:00

శాంతి స్థూపాన్ని చూస్తున్న గిరిజనులు

ప్రజాశక్తి- సీలేరు
జీకే వీధి మండలం సప్పర్ల వారపు సంతలో పోలీసులు శనివారం విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పిఎల్‌జిఏ ఆవిర్భావ వారోత్సవాల నేపథ్యంలో జీకే వీధి సిఐ అశోక్‌ కుమార్‌, 234 సిఆర్పిఎఫ్‌ బెటాలియన్‌ బీరేంద్ర కుమార్‌, స్థానిక ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో వారపు సంతలో అణువణువునా తనిఖీలు చేపట్టారు. అనుమానితుల్ని ప్రశ్నించారు. వాహనాలు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అనుమానితులు వివరాలు సేకరించి విడిచిపెట్టారు. మావోయిస్టుల కదిలికలపై నిఘ పెట్టారు. మావోయిస్టు ఇన్ఫార్మర్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.
సప్పర్లలో శాంతి స్థూపాలు
జీకే వీధి మండలం సప్పర్లలో శనివారం మావోయిస్టుల చేతులో హత్యకు గురైన గిరిజనులు పేరిట శాంతి స్థూపాలు శనివారం వెలిశాయి. మావోయిస్టు పిఎల్‌జిఎ వారోత్సవాలు నేపథ్యంలో శనివారం సప్పర్లలో వారపు సంత కావడంతో సంతకు వచ్చిన గిరిజనులు చూసే విధంగా వీటిని ఏర్పాటు చేశారు. మావోయిస్టులు చేతిలో అసువులు బాసిన గిరిజన సోదరులకు జోహార్లు అంటూ వాటిపై పేర్కొన్నారు.