అల్పాహారం అందజేస్తున్న దృశ్యం
ప్రజాశక్తి-బాపట్ల: జిల్లా నలుమూలల నుంచి స్పందనకు విచ్చేసే అర్జీదారులకు సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ పర్యవేక్షణలో సహారా ఇండియా బాపట్ల శాఖ సహకారంతో అల్పాహారం మంచినీరు అందజేశారు. నడవలేని వారికి వీల్ ఛైర్స్ ద్వారా అర్జీలు అందించటానికి రెడ్ క్రాస్ యువత సేవలందించారు. కార్యక్రమంలో బాపట్ల జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఛైర్మన్ బిఎస్ నారాయణ భట్టు, శ్రీ రామచంద్రమూర్తి, జి సున్నీ, ఎఎస్ భార్గవ్, మణికంఠ, గోపీనాథ్, సహారా ఇండియా ప్రతినిధి చామర్తి ఆంజనేయులు పాల్గొన్నారు.










