May 09,2023 21:54

ప్రజాశక్తి - ముదినేపల్లి
              స్పందనలో ఇచ్చిన ఫిర్యాదుపై మంగళవారం మత్యశాఖ అధికారులు గురజ వెళ్లి చేలను పరిశీలించి స్థానికుల ను విచారించారు. ఈ నెల రెండో తేదీన కైకలూరులోని సిఎన్‌ ఆర్‌ గార్డెన్‌లో జరిగిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో మండలంలోని గురజ మఠం వద్ద ఉన్న నివాసితులు తమ ఇళ్లను ఆనుకుని బడాబాబులు చెరువుల తవ్వకాలకు ప్రయత్నాలు చేసు ్తన్నారని, చెరువులు తవ్వితే తాము అనేక సమస్యలు పడాల్సి వస్తోందటూ, అనుమతులు ఇవ్వొద్దంటూ ఆరట్ల శివనాగరాజు, గ్రామస్తులతో కలిసి కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. ఈ ఫిర్యాదుపై మండల మత్యశాఖ సహాయ తనిఖీ అధికారి వి.సతీష్‌కుమార్‌, గురజ గ్రామ మత్యశాఖ సహాయకురాలు వినూత్న, ఫిర్యాదుదారుడు శివనాగరాజుతో కలిసి చేలను పరిశీలించారు. అనంతరం సతీష్‌కుమార్‌ మాట్లాడుతూ ఆక్వా చెరువులు తవ్వేందుకు ఎవరికి ఈ ప్రాంతంలో అను మతులు ఇవ్వలేదన్నారు. ఎవరైన చెరువుల తవ్వకాలు చేస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. తాము వచ్చి తవ్వకాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.