మంగళగిరి: మంగళగిరి టిడ్కో గృహసముదాయ ప్రాంతంలో, నివాసాలకు పక్కనే అక్రమ చెత్త డంపింగ్, జంతు కళే బరాలు, మెడికల్ వ్యర్ధాల డంపింగ్ ను నిలుపుదల చేయిం చాలని కోరుతూ స్పందనలో ఫిర్యాదు చేశారు. పట్టణ టిడిపి అధ్యక్షులు దామర్లరాజు సోమవారం ఉదయం స్థానిక నివా సితులతో అర్జీ అందజేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుర్గంధం, కాలుష్యంతో, స్థానికంగా నివాసం ఉం టున్న టిడ్కో గృహ సముదాయవాసులు ఇబ్బందులు పడుతున్నారని, దోమలు పెరిగి ప్రజలు పలు వ్యాధులకు గురవుతున్నారని అన్నారు. అలాగే, టిడ్కో గృహ సము దాయ కూడలిలో స్పీడ్ బ్రేకర్లను వేయించాలని, ద్విచక్ర వాహనాలు అమిత వేగంతో ఇటీవల పలు ప్రమాదాలు సంభవించాయని, టిడ్కో గృహ ఈశాన్య భాగాన ఉన్న చెరువు ప్రమాదభరితంగా మారిందని మొదలైన సమ స్యలను పరిష్కరించాలని కోరినట్లు చెప్పారు. టిడిపి నాయకులు అబ్దుల్ మజీద్, వి.మాధవరావు, జి.రాఘవ, బి.శ్రీనివాసరావు, సిహెచ్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










