ప్రజాశక్తి-పాడేరు: స్పందనలో అందిన వినతులపై తక్షణమే విచారణాదికారిని నియమించి తగు విచారణ జరిపి సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకోవాలని ఐటిడిఎ ప్రాజెక్ట్ అధికారి రోణంకి గోపాలకృష్ణ ఆదేశించారు. ఐటిడిఎ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన స్పందనలో పిఒ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శి తరచూ స్పందన ఫిర్యాదులపై సమీక్షిస్తున్నారని, జిల్లాలోని అధికారులు ఫిర్యాదులపై వెంట వెంటనే స్పందించి తగు చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. వెబ్సైట్‌లో ఫోటోలతో సహా అప్‌లోడ్ చేయాలని తెలిపారు. ఆర్ధిక సమస్యలపై తగు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించి నిధులు విడుదలైన వెంటనే ఆ సమస్యను పరిష్కరించాలని ఆ మేరకు ఫిర్యదుదారుకు సమాధానం పంపా లని సూచిం చారు.
శుక్రవారం జరిగిన స్పందనకు వివిధ అంశాలపై 42 ఫిర్యాదులు అందాయి. ముఖ్యంగా పించన్ అందలేదని, ఉపాధి కల్పించాలని, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌లో చేసిన పనులకు బిల్లులు, అంగన్వాడి కేంద్రంలో తాగు నీటి సమస్య, సోలార్ పెన్సింగ్ మంజూరు, రహదారుల నిర్మాణానికి సంబంధించిన ఫిర్యాదులు అందాయి.ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ జే.శివశ్రీనివాసు, జిల్లా, డివిజన్ స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.










