ప్రజాశక్తి-మామిడికుదురు(పి.గన్నవరం)
స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటుచేసిన స్పందన కార్యక్రమంలో అర్జీదారుల నుంచి సుమారు 110 వినతులను జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.నుపూర్ అజరు, ఆర్‌డిఒ ఎం.ముక్కంటి స్వీకరించారు. జెసి మాట్లాడుతూ అర్జీదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించి నిబంధనలకు లోబడి తగు పరిష్కార మార్గాలు అర్జీదారు సంతప్తి చెందే స్థాయిలో చూపాలని స్పష్టం చేశారు. అర్జీ దారుని సంతప్తే ధ్యేయంగా అర్జీల పరిష్కార సరళి ఉండాలని అన్నారు. గడువు దాటిన అర్జీలు లేకుండా అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు ఒకసారి సమర్పించిన దరఖాస్తు మరల రీఓపెన్(పునరావతం) కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలలో రన్నింగ్ వాటర్ తదితర అత్యవసర సమస్యలపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి ఆయా వసతులను పునరుద్ధరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో గ్రామ వార్డు సచివాలయ నోడల్ అధికారి భీమేశ్వరరావు, రహదారులు భవనాల శాఖ ఇఇ బి.రాము, తహశీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి డివిజన్ స్థాయి, మండల స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.










