May 22,2023 22:22

సమస్యలు వింటున్న ఎంపి గీత, కలెక్టర్‌ కృతిక

ప్రజాశక్తి - కాకినాడ
కాకినాడ కలెక్టరేట్‌ స్పందన సమావేశ మందిరంలో సోమవారం జరిగిన జిల్లాస్థాయి స్పందన కార్యక్రమంలో ఎంపి వంగా గీత, కలెక్టర్‌ కృతికాశుక్లా, జాయింట్‌ కలెక్టరు ఎస్‌.ఇలాక్కియా, ఇన్‌చార్జ్‌ డిఆర్‌ఒ, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, జడ్‌పి సిఇఒ ఎన్‌.వి.వి. సత్యనారాయణ, బీసీ కార్పొరేషన్‌ ఈడీ ఎస్‌.వి.ఎస్‌. సుబ్బలక్ష్మిలతో కలిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తవం 330 అర్జీలను స్వీకరించారు. జిల్లా కలెక్టరు మాట్లాడుతూ ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి తప్పనిసరిగా గడువులోపు సమస్య పరిష్కారం అయ్యే విధంగా అధికారులు ప్రత్యేక కృషిచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్‌ వివిధ సెక్షన్ల అధికారులు పాల్గొన్నారు.
పోలీస్‌ స్పందనకు 37 అర్జీలు
కాకినాడ కార్పొరేషన్‌ : కాకినాడ జిల్లా పోలీస్‌ కార్యాలయంలో ప్రతి సోమవారం నిర్వహించే పోలీస్‌ గ్రీవెన్స్‌ కు 37 అర్జీలు వచ్చాయని ఎస్పి సతీష్‌ కుమార్‌ తెలిపారు. అర్జీదారుల సమస్యల పరిష్కారానికి సంబంధిత పోలీసు అధికారులతో ప్రత్యక్ష వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడి తగు చర్యలు తీసుకోవాలని పోలీస్‌ సిబ్బందికి సూచించారు. అనంతరం అర్జీదారులకు ఉచిత భోజన సౌకర్యాలు కల్పించారు. కార్యక్రమంలో ఎఎస్‌పి శ్రీనివాస్‌, కాకినాడ ట్రాఫిక్‌ డిఎస్‌పి ఎం వెంకటేశ్వరరావు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు కాకినాడ కార్పొరేషన్‌ కార్యాలయంలో వివిధ ప్రాంతాల నుంచి టౌన్‌ ప్లానింగ్‌, పారిశుధ్యం వివిధ సమస్యలకు సంబంధించి ఏడుగురు ఆర్‌.మహేష్‌కుమార్‌కు వినతులు అందజేశారు. సమస్యలను సత్వరమే పరిష్క రించేందుకు చర్యలు తీసుకోవాలని వివిధ విభాగాధిపతులను కమిషనర్‌ ఆదేశించారు. ఎడిసి సిహెచ్‌ నాగ నరసింహారావు, స్మార్ట్‌ సిటీ ఎస్‌ఇ వెంకట్రావు, మేనేజర్‌ సత్యనారాయణ, టిపిఆర్‌ఒ ఎం.కృష్ణమో హన్‌ డిఇలు, అధికారులు పాల్గొన్నారు.