ప్రజాశక్తి-అనకాపల్లి
అనకాపల్లి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 166 దరఖాస్తులు వచ్చాయి. కలెక్టర్ రవి పఠాన్ శెట్టి, జెసి కల్పనాకుమారి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం సీతామహాలక్ష్మి ఇందులో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దరఖాస్తుదారుడు మొదటిసారి అర్జీ పెట్టినప్పుడే సమస్యను క్షుణ్ణంగా పరిశీలించి పూర్తి స్థాయిలో పరిష్కరించాలని, మళ్లీ పునరావృతం కాకూడదని అధికారులను ఆదేశించారు. దరఖాస్తు దారునికి సంతృప్తికరమైన సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
ఎస్పీ కార్యాలయంలో 30
జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 30 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ గౌతమి శాలి నేరుగా ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. వారి సమస్యలు తెలుసుకొని సంబంధిత పోలీస్ అధికారులతో చట్ట పరిధిలో సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.










