Jun 13,2023 00:06

సమస్యలు వింటున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ప్రజాశక్తి - రంపచోడవరం
స్థానిక ఐటిడిఎ కార్యాలయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి రంపచోడవరం పరిధిలో మండలాల నుంచి 43 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే, ఎపిఒ సిహెచ్‌.శ్రీనివాసరావు స్వీకరించారు. రంపచోడవరం మండలం పోక్స్‌పేట గ్రామంలో తమ భూ సమస్య పరిష్కరించాలని కారం నరసాయమ్మ అర్జీ ఇచ్చారు. తాను టీచర్‌ ట్రైనింగ్‌ పూర్తి చేసి ఖాళీగా ఉన్నాయని, సిఆర్‌టి ఉద్యోగం ఇప్పించాలని వై రామవరం మండలం చాపరాయి గ్రామానికి చెందిన పీవీ భూపతి రెడ్డి దరఖాస్తు సమర్పించారు. రాజవొమ్మంగి గ్రామంలో చాలా ఏళ్ల నుండి కొండపోడు వ్యవసాయం చేసి జీవిస్తున్నామని, తమకు పోడు పట్టా మంజూరు చేయాలని మద్దేశు గంగరాజు విన్నవించారు. పందిరి మామిడి జంక్షన్‌ నుండి చవిటి దిబ్బలు గ్రామం మధ్యలో భీమవరం, నరసాపురం గ్రామాలలో 7 కిలోమీటర్ల మేరకు ఫారెస్ట్‌ క్లియరెన్స్‌ మంజూరు చేసి, రోడ్డు పూర్తి చేయాలని ఎంపీటీసీ బచ్చల మంగమ్మ దరఖాస్తు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు జాన్‌ రాజ్‌, డిఎస్‌ శాస్త్రి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ జి.డేవిడ్‌ రాజ్‌, నాగేశ్వరరావు, రీజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ఓబి.ఇందిర, వెలుగు ఏపిడి ఏ.శ్రీనివాసరావు. ప్రాజెక్ట్‌ ఆర్టికల్చర్‌ అధికారి రాంబాబు, వ్యవసాయ శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్లు సిహెచ్‌కెవి చౌదరి, సావిత్రి, ఏఎంవో సి.శ్రీహరి, ఏడిఎంహెచ్‌ఒ డాక్టర్‌ రాధి గోపిక, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు అల్లాడి వెంకటేశ్వరరావు, సాయి సతీష్‌, రాజేంద్ర బాబు, దుర్గాప్రసాద్‌, డిప్యూటీ తహశీల్దారు రవీంద్రబాబు, గిరిజన సంక్షేమ శాఖ డిడి కార్యాలయ సూపరింటెండెంట్‌ బి.కిషోర్‌, జిసిసి డివిజనల్‌ మేనేజర్‌ జి.పార్వతీశ్వరరావు, సిడిపిఓ సంధ్యారాణి, లీగల్‌ సెల్‌ న్యాయవాది సత్యనారాయణ పాల్గొన్నారు.