ప్రజాశక్తి - రంపచోడవరం
రంపచోడవరం ఐటిడిఎ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 32 దరఖాస్తులు ఇచ్చాయి. వీటిని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సూరజ్ గనోరే, సబ్ కలెక్టర్ శుభం బన్సల్, ఐటిడిఎ ఎపిఒ సిహెచ్.శ్రీనివాసరావు స్వీకరించారు. వై.రామవరం మండలం కానివాడ పంచాయితీ పరిధి బంద గ్రామం నుండి కానివాడ వరకు 6 కిలోమీటర్లు సీసీ రోడ్డు ఏర్పాటు చేయాలని, ఫైబర్ నెట్‌కు మరమ్మతులు చేయించాలని ఆ పంచాయతీ సర్పంచ్ పల్లాల శిల్పారాణి వినతిపత్రం అందజేశారు. ఇంజనీరింగ్ పూర్తి చేశానని, సివిల్ సర్వీసెస్ శిక్షణకు ఆర్థిక సహాయం చేయాలని అడ్డతీగల మండలం కొట్టంపాలెం గ్రామానికి చెందిన ఈక రాజేష్ విన్నవించారు. దేవీపట్నం మండలం దేవారం గ్రామంలో భూ సమస్య పరిష్కరించాలని తెల్లము కమన్నదొర, పోతవరం చిన్నారి గండి, దేవారం గ్రామాలలో వ్యవసాయ చెరువులకు సంబంధించిన సాగునీరు కొరకు తూరలు ఏర్పాటు చేయాలని ఎంపీటీసీ తుర్రం జగదీష్ దొర, ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ తెల్లం శేఖర్ దరఖాస్తులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జాన్ రాజ్, డిఎస్.శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి.డేవిడ్‌రాజ్, రీజనల్ మెడికల్ ఆఫీసర్ ఓబి.ఇందిర, వెలుగు ఎపిడి ఎ.శ్రీనివాసరావు, హార్టికల్చర్ అధికారి రాంబాబు, ఎఎంఒ సి.శ్రీహరి, ఎడిఎం అండ్ హెచ్‌ఒ డాక్టర్ అనూష, వైద్యాధికారులు డాక్టర్ రాధిక, కె.లక్ష్మి, గోపిక, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చైతన్య, ఎ.వెంకటేశ్వరరావు, రాజేంద్ర బాబు, రంగారావు, దుర్గాప్రసాద్, చైతన్య, ఏఈఎంవివి సత్యనారాయణ, డిప్యూటీ తహశీల్దారు చైతన్య బాబు, గిరిజన సంక్షేమ శాఖ డిడి కార్యాలయ సూపరింటెండెంట్ బి.కిషోర్, జిసిసి సీనియర్ మేనేజర్ ఎం.నాగ వెంకట, రాజారెడ్డి, సిడిపిఓ సంధ్యారాణి, లీగల్ సెల్ న్యాయవాది సత్యనారాయణ, మత్స్యశాఖ ఫీల్డ్ అధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.










