Aug 28,2023 22:19

వినతులు స్వీకరిస్తున్న అధికారులు

ప్రజాశక్తి - శ్రీకాకుళం: జిల్లాపరిషత్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 210 వినతులు వచ్చాయి. జిల్లా నలుమూలల నుంచి పలు సమస్యలపై అర్జీలదారుల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పందన కార్యక్రమానికి వచ్చిన అర్జీలపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. అర్జీదారులకు అధికారులు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందనందునే అర్జీలు రీఓపెన్‌ అవుతున్నాయన్న సంగతి గుర్తెరగాలన్నారు. రీఓపెన్‌ అర్జీలు 12 ఉన్నాయని, వాటిని ఆయా అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆదేశించారు. స్పందనలో వచ్చిన అర్జీలకు గడువును బట్టి 24 గంటల నుంచి ఐదు రోజుల్లోగా పరిష్కారం చూపాలన్నారు. జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో ఐదు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇకపై అధికారులు ప్రతిరోజూ వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిశీలించి పరిష్కరించాలన్నారు. ఆదివారం నాటికి ఎటువంటి దరఖాస్తులు పెండింగ్‌ లేకుండా చూసుకుని, సోమవారం నిర్వహించే స్పందనకు హాజరు కావాలన్నారు. సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ప్రత్యేక ఉప కలెక్టర్‌ జి.జయదేవి, జిల్లా రెవెన్యూ అధికారి పి.మురళీకృష్ణ, డిఆర్‌డిఎ పీడీ డి.వి విద్యాసాగర్‌తో కలిసి వినతులు స్వీకరించారు. కార్యక్రమంలో సిపిఒ వి.ఎస్‌.ఎస్‌ లకీëప్రసన్న, డిఎంహెచ్‌ఒ బి.మీనాక్షి, జెడ్‌పి, సెట్‌శ్రీ సిఇఒలు ఆర్‌.వెంకట్రామన్‌, బి.వి ప్రసాదరావు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.