స్పందన వినతులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి.
అర్జీలు పెండింగ్ లేకుండా గడువులోపల పరిష్కరించాలి
అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గడువులోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వైయస్సార్ సెంటినరీ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి, డిఆర్ఓ పుల్లయ్య, జిల్లా పరిషత్ డిప్యూటీ సిఇఓ సుబ్బారెడ్డి, డిఆర్డిఏపిడి శ్రీధర్ రెడ్డి, ఇతర జిల్లా ఉన్నతాధికారులు ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ స్పందన అర్జీలపై జాప్యం లేకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ నిశాంతి.టి మాట్లాడుతూ స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని ఏ ఒక్క దరఖాస్తు బియాండ్ ఎస్ ఎల్ ఏలోకి వెళ్లకుండా చూడాలన్నారు. బియాండ్ ఎస్ఎల్ఎలోని దరఖాస్తులన్నింటినీ వేగంగా గడువులోగా పరిష్కరించాలని పరిష్కారంకాని సమస్యలకు సరైన ఎండార్స్మెంట్ ఇచ్చి క్లోజ్ చేయాలన్నారు. లేని పక్షంలో మల్లీ అవే సమస్యలు తిరిగి పునరావృతమయ్యే అవకాశముందన్నారు. పరిష్కార నివేదికలో అర్జీదారులకు అర్థమయ్యే విధంగా పూర్తి వివరాలతో ఎండార్స్మెంట్ ఇవ్వాలన్నారు. స్పందన కార్యక్రమంలో ప్రతి అర్జీని బాధ్యతగా తీసుకుని పరిష్కరించే కోణంలో ఆలోచించాలన్నారు. సోమవారం స్పందన కార్యక్రమంలో వచ్చిన అర్జీలను త్వరితగతిన క్లియర్ అయ్యేటట్లు చూడాలన్నారు. జిల్లా నలుమూలల నుంచి ప్రజలు ఎన్నో వ్యయప్రయాసలకోర్చి తమ సమస్యల పరిష్కారం కోసం స్పందన కార్యక్రమానికి వస్తుంటారని అధికారులు బాధితుల సమస్యలను గుర్తించి పరిష్కరించాలన్నారు.










