Sep 04,2023 23:14

ప్రజాశక్తి-కాకినాడ జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో అందిన వినతులపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ కృతికాశుక్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టర్‌ కార్యాలయం, స్పందన సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం (స్పందన) కార్యక్రమంలో జిల్లా కలెక్టరు డాక్టర్‌ కృతికాశుక్లా, డిఆర్‌ఒ కె.శ్రీధర్‌ రెడ్డి, జెడ్‌పి సిఇఒ ఎ.రమణారెడ్డి, ఎస్‌సి కార్పొరేషన్‌ ఇడి డిఎస్‌.సునీత, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి, పౌరసరఫరాల డిఎం డి.పుష్పమణిలతో కలిసి హాజరయ్యారు. జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి, పరిష్కరించాల్సిందిగా అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు.