Oct 16,2023 21:01

ప్రజాశక్తి - భీమవరం
ప్రజా సేవ చేయడం అదృష్టంగా భావించి అధికారులు పనిచేయాలని, స్పందన సమస్యలు వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లాస్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 252 దరఖాస్తులను కలెక్టర్‌ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం, స్పందనలో ప్రజలు అందజేసిన అర్జీలను వెంటనే పరిష్కరించి అర్జీదారులను సంతృప్తి పర్చాలని ఆదేశించారు. స్పందనలో ప్రజలు అందజేసిన అర్జీలపై అలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్‌ కలెక్టరు ఎస్‌.రామ్‌ సుందర్‌రెడ్డి, డిప్యూటీ ట్రెయినీ కలెక్టర్‌ కానాల సంగీత్‌ మథూర్‌, జిల్లా పంచాయతీ శాఖ అధికారి జివికె. మల్లికార్జునరావు, డిఎల్‌డిఒ అప్పారావు పాల్గొన్నారు.