ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే
ప్రజాశక్తి - రంపచోడవరం : స్పందనలో వచ్చిన సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు ఐటిడిఎ పిఒ సూరజ్ గనోరే స్పష్టం చేశారు. ప్రజల నుంచి స్వీకరించిన పలు సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించి, మిగిలిన వాటిని సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు. సోమవారం స్థానిక ఐటిడిఏ సమావేశ మందిరంలో పిఒ సూరజ్ గనోరేతోపాటు సబ్‌కలెక్టర్ శుభం బన్సల్, ఎపిఒ జనరల్ సిహెచ్ శ్రీనివాసరావు స్పందనలో పాల్గొని అర్జీలను స్వీకరించారు 64 దరఖాస్తులు రాగా, వాటిలో వై రామవరం మండలం చింతలపూడి పంచాయతీలో 100 మంది రైతుల భూమిని సర్వే చేసి మ్యుటేషన్ చేయించాలని చింతలపూడి ఉపసర్పంచ్ పల్లాల లచ్చిరెడ్డి. పల్లాల. దేవిరెడ్డి దరఖాస్తు సమర్పించారు. ప్రమాదంలో విరిగిపోయిన తమ కొడుకు కాలును ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ చేయించాలని వై రామవరం మండలం భీముడుగడ్డ గ్రామానికి చెందిన కత్తుల లచ్చిరెడ్డి వేడుకున్నాడు. జీవనోపాధికి ఆవులు. గేదెలు సబ్సిడీపై మంజూరు చేయాలని రాజవొమ్మంగి మండలం కిండ్రా గ్రామానికి చెందిన యల్.రామిరెడ్డి అర్జీ ్త సమర్పించారు. అడ్డతీగల మండలంలోని రాయిగూడెం గ్రామంలో సర్వే నెంబర్లు 21/4,20/3 గల భూముల సమస్య పరిష్కరించాలని ముర్రం రాంబాబు దరఖాస్తు సమర్పించారు. మారేడుమిల్లి మండలం తాడేపల్లి పంచాయతీలోని నీలవరం నుంచి మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఐదు కిలోమీటర్లకు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇప్పించి రోడ్డు మంజూరు చేయాలని రేవుల ప్రతాపరెడ్డి. కత్తుల ఆదిరెడ్డి. కత్తుల భూమిరెడ్డి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో ఇఇలే డేవిడ్ రాజ్, ఎండి యూసఫ్, నాగేశ్వరరావు, వెలుగు ఎపిడి ఎ. శ్రీనివాసరావు. డిఎల్‌డిఒ కె. కోటేశ్వరరావు, ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కల్పన. డాక్టర్ రాధిక. పశుసంవర్ధక శాఖ వైద్యాధికారి డాక్టర్ గోపిక ,పిహెచ్‌ఒ కె.చిట్టిబాబు, జిసిసి సీనియర్ మేనేజర్ ముర్ల నాగరాజారెడ్డి. మలేరియా అధికారి రామకృష్ణ. సిడిపిఒ సంధ్యారాణి, డిఇఇలు సాయి సతీష్, శ్రీనివాసరావు,శ్రీనివాసరావు, దుర్గాప్రసాద్, రాజేంద్ర బాబు, పిఎఒ రాంబాబు, ఎడిఎలు సిహెచ్ కెవి చౌదరి. సావిత్రి, ఏజెన్సీ డిఇఒ, గిరిజన సంక్షేమశాఖ కార్యాలయ సూపరింటెండెంట్ బి. కిషోర్, డివిజినల్ సివిల్ సప్లై అధికారి సి. శ్రీహరి, డిటి తాతారావు. చైతన్యబాబు విశ్వనాథం, సబ్ కలెక్టర్ కార్యాలయ పరిపాలన అధికారి యం.సావిత్రి. ఎస్‌ఒ కబోది. పాల్గొన్నారు,










