Jan 02,2023 23:00

సమస్యల దరఖాస్తులను స్వీకరించి సూరజ్‌ గనోరే

ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే
ప్రజాశక్తి - రంపచోడవరం
: ఏజెన్సీలోని మారమూల గ్రామాల నుంచి వచ్చే గిరిజనులు అందజేస్తున్న స్పందన అర్జీలను సత్వరమే పరిశీలించి, పరిష్కరించాలని ఐటిడిఎ పిఒ సూరజ్‌గనోరే ఆదేశించారు. సోమవారం స్థానిక ఐటిడిఎలో నిర్వహించిన స్పందనలో పిఒతోపాటు రంపచోడవరం సబ్‌కలెక్టర్‌ శుభం బన్సల్‌, ఐటిడిఎ ఎపిఒ సిహెచ్‌.శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొని అర్జీలు స్వీకరించారు. వ్యక్తిగత, సామాజిక అవసరాలకు సంబంధించి 25వినతులురాగా, వాటిని పరిశీలించిన అధికారులు కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించగా, మిగిలిన వాటి పరిష్కారానికి హామీనిచ్చారు. ఈవారం వచ్చిన అర్జీలలో ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు, ఉద్యోగాల కల్పనకు సంబంధించి అర్జీలు ప్రధానంగా రాగా, వీటితోపాటు రంపచోడవరం సాయినగర్‌లో భూసమస్య పరిష్కరించాలని మడి తమన్నాదొర వినతి అందజేశాడు. దేవీపట్నం మండలం కొండమొదలు పంచాయితీ కె.గొందూరులో పోలవరం ప్రాజెక్టు ముంపు బాధితులైన గిరిజనేతరులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీకి సంబంధించిన ఇళ్లు మంజూరు చేయాలని ముళ్ళ వెంకటలక్ష్మి దరఖాస్తు సమర్పించారు. దేవిపట్నం మండలంలో పోలవరం ప్రాజెక్టు వల్ల గోదావరి నీటి ముంపునకు గురైన పూడిపల్లిలో సుమారు 40 మందికి ఇళ్లు నిర్మించాలని పిఎన్‌వి.పోసిబాబు, పి. రమేష్‌, కె. మణికంఠ వినతి అందజేశారు. కార్యక్రమంలో ఇఇలు నాగేశ్వరరావు, ఎండి యూసఫ్‌, వెలుగు ఎపిడి ఎ.శ్రీనివాసరావు, ఎఎండిహెచ్‌ఒ డాక్టర్‌ అనూష. ఏరియా ఆస్పత్రి సూపరెంటిండెంట్‌ డాక్టర్‌ కల్పన, డాక్టర్‌ రాధిక. వెటర్నరీ డాక్టర్‌ గోపిక, పిహెచ్‌ఒ కె.చిట్టిబాబు, మలేరియా విభాగం అధికారి రామకృష్ణ, సిడిపిఒ సంధ్యారాణి, ఎంపిడిఒ ఎంవిఆర్‌ కుమార్‌బాబు, డిఇఇలు సాయిసతీష్‌, రాజేంద్రబాబు, దుర్గాప్రసాద్‌, పిఎఒ రాంబాబు, ఎడిఎలు సిహెచ్‌ కెవి చౌదరి, సావిత్రి, ఏజెన్సీ డిఇఒ కార్యాలయ సూపరింటెండెంట్‌ ఎంవివి.రమణ, గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్‌ కిషోర్‌, డివిజినల్‌ సివిల్‌ సప్లై అధికారి సిశ్రీహరి, డిటి తాతారావు. రవీంద్రబాబు, చైతన్యబాబు, విశ్వనాథం, సబ్‌ కలెక్టర్‌ కార్యాలయ పరిపాలనాధికారి యం.సావిత్రి. పాల్గొన్నారు.