
రామాపురం : జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ గిరీష పిఎస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో మండల స్థాయి జగనన్నకు చెబుదాం - స్పందన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ గిరీష పిఎస్, జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్, ఆర్డీవో రంగస్వామి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు స్పందన దరఖాస్తులపై ప్రత్యేక దష్టి సారించి నిర్ణీత కాల పరిమితిలోగా సమస్యలు పరిష్క రించా లన్నారు. ప్రజలను పదేపదే కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలు గ్రా మాలలోనే పరిష్కరించాలనే ఉద్దేశంతో జగనన్నకు చెబుదాం మండల స్థాయి స్పందన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని చెప్పారు. కార్యక్రమం ద్వారా దాదాపు 90 శాతం వరకు ప్రజల సమస్యలు గ్రా మాలలోనే పరిష్కార మవుతాయన్నారు. మండల స్థాయి స్పందన కార్యక్రమంలో ఎక్కువగా భూ సమస్యలు పరిష్కర మవుతున్నాయన్నారు. అన్ని శాఖల హెచ్‌ఒడిలు జగనన్నకు చెబుదాం. స్పందన కార్యక్రమానికి రావడం జరిగిందని ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసు కోవాలన్నారు.
రామాపురం మండలం, నల్లగుట్టపల్లి గ్రామానికి చెందిన ఎస్. వెంకటలక్ష్మి తనకు వద్ధాప్య పెన్షన్ మంజూరు చేయాలని కలెక్టర్ కు స్పందన కార్యక్రమంలో అర్జీ సమర్పించారు.అదే గ్రామానికి చెందిన కె .ఇమామ్ సాబ్, సర్వేనెంబర్ 625 లో 7.36 ఎకరాల భూమి సర్వే చేసి పాసు బుక్కులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. సరస్వతిపల్లెకు చెందిన షేక్ దర్బార్ సర్వేనెంబర్ 441/1 లో 3.11 ఎకరాల భూమి రీ సర్వే చేశారని, రీసర్వేలో 90 సెంట్లు భూమి తక్కువ వచ్చిందని ్ల కలెక్టర్‌కు విన్నవించారు. హసనాపురం గ్రామానికి చెందిన బుల్లినేని రాజా తనకు ప్రస్తుతం రూ. 3 వేల రూపాయలు వికలాంగుల పెన్షన్ వస్తుం దన్నారు. తనకు వందశాతం వికలాంగత్వం ఉందని ఈ పెన్షన్‌ను రూ. 5 వేలు వరకు పెంచాలని కోరారు. సమస్యలన్నీ వెంటనే పరిష్క రించాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపిపి జనార్దన్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ విశ్వనాథరెడ్డి, జడ్‌పిటిసి మానస వెంకటరమణ, సర్పంచ్ సంఘం అధ్యక్షుడు నాగభూషణ్ రెడ్డి, సర్పంచులు, ఎంపిటిసిలు, జిల్లా, మండల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.