
రోడ్డుపై నిలిచిన మురుగునీటిని పరిశీలిస్తున్న డిఎల్పిఒ లక్ష్మణరావు
పెదనందిపాడు రూరల్: గ్రామంలో ఇటీవల అభివృద్ధి కుంటుపడుతుందంటూ వార్డు సభ్యులు గ్రామస్తులు ఇటీవల గుంటూరు స్పందనలో ఇచ్చిన ఫిర్యాదు మేరకు సోమవారం సాయంత్రం డి ఎల్ పి ఓ లక్ష్మణ్ రావు పెదనందిపాడులో విచారణ చేపట్టారు. సచి వాలయంలో వివరాలు సేకరించారు రికార్డులు పరి శీలించారు. తాగునీటి చెరువులో నీరు వాసన వస్తున్నాయని వాడుకోవడానికి కూడా పనికిరాకుండా పోయాయని గ్రామ స్తులు తెలిపారు. స్పందనలో వచ్చిన ఫిర్యాదులను పరి శీలించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి ఉన్నతాధికారు లకు నివేదిక అందజేస్తామని చెప్పారు.