మాట్లాడుతున్న తమశీల్దార్ జానకమ్మ
ప్రజాశక్తి-కోటవురట్ల వివిధ సమస్యలపై స్పందన ఫిర్యాదులు ఎప్పటికప్పుడు పరిష్కరించాలని తహశీల్దారు జానకమ్మ సూచించారు. గురువారం గ్రామ రెవెన్యూ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధానంగా సమగ్ర భూ సర్వే పట్ల రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని, పెండింగ్ ఫైల్స్ ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని సూచించారు. మ్యూటిషన్ విషయంలో నిర్లక్ష్యం చేయరాదన్నారు. సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ సోమశేఖర్, మండల సర్వేయర్ ప్రసాద్, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.










