ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: స్పందన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అధికారులను కోరారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ స్పందన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు స్పందన కార్యక్రమంలో తమ సమస్యలను స్వయంగా జిల్లా ఎస్పీ దృష్టికి తీసుకెళ్లారు. పిటీషన్‌దారుల సమస్యలను చట్టపరిధిలో పరిష్కారం చూపేలా సంబంధిత పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. చట్టపరిధిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోపు ఫిర్యాదుదారుల సమస్యలను పరిష్కరించాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు సూచించారు. స్పందన కార్యక్రమంలో కుటుంబ కలహాలు, ఆర్థిక లావాదేవీలు, భూ వివాదాలు, ఇతర సమస్యల గురించి 43 మంది ఫిర్యాదుదారులు తమ సమస్యలు ఎస్‌పి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో స్పందన సెల్ ఇన్‌స్పెక్టర్ వి మాలకొండయ్య పాల్గొన్నారు.










