Nov 20,2023 21:46

ఫిర్యాదుదారులతో మాట్లాడుతున్న ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌

పార్వతీపురం రూరల్‌: ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులను పరిశీలించి వెంటనే బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించారు. సమస్యలపై ఫిర్యాదుదారులు స్వేచ్ఛగా విన్నవించుకోగా, వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోని, తీసుకున్న చర్యలకు సంబంధించిన నివేదికను జిల్లా పోలీసు ప్రదాన కార్యాలయానికి పంపాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పది ఫిర్యాదులు అందాయి. ఈ స్పందన కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ (అడ్మిన్‌) ఒ.దిలీప్‌ కిరణ్‌, ట్రైనీ డిఎస్పీ ఎస్‌ఎండి అజీజ్‌, ఎస్‌బి సిఐ సిహెచ్‌.లక్ష్మణరావు, టౌన్‌ సిఐ కృష్ణారావు, డిసిఆర్‌బి సిఐ ఎన్‌వి ప్రభాకరరావు, ఎస్‌ఐ పాపారావు, సిబ్బంది పాల్గొన్నారు.