Aug 24,2023 19:34

క్షుత్ర స్థాయిలో కమిషనర్‌ పర్యటన దృశ్యం

ప్రజాశక్తి-నెల్లూరు :నగర పాలక సంస్థ పరిధిలో స్పందన వేదిక ద్వారా అందుకున్న ప్రజా సమస్యల పరిష్కారానికి కమిషనర్‌ వికాస్‌ మర్మత్‌ క్షేత్ర స్థాయిలో పర్యటించారు. స్థానిక పెద్ద పోస్ట్‌ ఆఫీస్‌, మధ్వపతి వారి వీధి, గుడిపల్లి పాడు, నేతాజీ నగర్‌ ప్రాంతాలకు సంభందించి ''జగనన్నకు చెబుదాం'', స్పందన ఫిర్యాదులను కమిషనర్‌ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం చూపించి పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కమిషనర్‌ ఆదేశించారు స్థానిక కార్పొరేటర్‌ నీలి రాఘవ, నగర పాలక సంస్థ ప్లానింగ్‌ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రారంభించనున్న ''ఆహా'' క్యాంటీన్ల ఏర్పాటు కోసం స్థానిక వై.ఎమ్‌.సి.ఏ మైదానం తదితర ప్రాంతాలలో స్థలాలను కమిషనర్‌ పరిశీలించారు.