May 01,2023 19:59

స్పందనలో తహశీల్దార్‌ లక్ష్మీనారాయణతో మాట్లాడుతున్న గుమ్మనూరు రైతులు

ప్రజాశక్తి - చిప్పగిరి
ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులన్నింటినీ తమ పరిధిలోనే పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని తహశీల్దార్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. సోమవారం తహశీల్దార్‌ కార్యాలయంలో జరిగిన స్పందనకు మండల అధికారులంతా హాజరయ్యారు. గుమ్మనూరు గ్రామానికి చెందిన కదిరి మెట్ట మోహన్‌, చాకిబండ తిమ్మప్ప అన్నదమ్ములకు సంబంధించిన పొలం ఆన్‌లైన్‌లో ఎక్కించాలని, రాజీ ఒప్పందంతో తహశీల్దార్‌ను కోరారు. లోక్‌ అదాలత్‌ ద్వారా రాజీ అవుతున్నట్లు న్యాయవాదులు లక్ష్మీకాంతం, ప్రవీణ్‌ కుమార్‌ తహశీల్దార్‌కు వివరించారు. తహశీల్దార్‌ మాట్లాడుతూ... రాజీమార్గం ద్వారా ఇద్దరు వినతుల మేరకు పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు. ఎంపిడిఒ సుధాకర్‌ రాజు, ఇఒఆర్‌డి సంజన్న, ఎఒ ఆనంద్‌, ఎంఇఒ మస్తాన్‌ రావు, పిఆర్‌ ఎఇ చోళా రెడ్డి, ఎపిఎం నాగార్జున, సూపర్‌వైజర్‌ ప్రసూన, హౌసింగ్‌ భవ్య, ట్రాన్స్‌కో ఎఇ ఉలిగన్న పాల్గొన్నారు.