ప్రజాశక్తి-అనకాపల్లి
స్పందన కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కారం చేయాలని కలెక్టర్ రవి పఠాన్ శెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జీదారులకు జవాబులు స్పష్టంగా ఇవ్వాలన్నారు. అర్జీదారులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. కాగా స్పందన కార్యక్రమానికి 155 దరఖాస్తులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో జెసి కల్పనా కుమారి, డిఆర్‌ఓ వెంకటరమణ పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో 28 ఫిర్యాదులు
అనకాపల్లి ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమానికి 28 ఫిర్యాదులు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ గౌతమి శాలి ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. చట్ట పరిధిలో సమస్యలు పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
పోగొట్టుకున్న మొబైల్స్ రాబట్టేందుకు చర్యలు
పేద మధ్యతరగతి, ఇతర వర్గాల వారు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను తిరిగి రాబట్టుకునే కార్యక్రమానికి ఎస్పీ గౌతమి శాలి శ్రీకారం చుట్టారు. అనకాపల్లి జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్ 9505200100 తక్షణమే హారు టైప్ చేయడం ద్వారా ఈ సేవలు పొందవచ్చని తెలిపారు.










