
ప్రజాశక్తి -కొత్తకోట:రావికమతం మండల కేంద్రం లో బుధవారం నిర్వహించిన జగన్నకు చెబుదాం, స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కు గిరిజన రైతులు అందించిన ఆర్జీల పరిష్కారంపైఅసిస్టెంట్ కలెక్టర్ స్మరణారాజు, నర్సీపట్నం ఆర్డీవో జయరాం గురువారం చీమలపాడు గ్రామంలో బహిరంగ విచారణ నిర్వహించారు. ఈ మేరకు చీమలపాడు పంచాయితీ ములకలాపల్లి గ్రామానికి చెందిన గిరిజన రైతులు కవల చంద్రయ్య, శెట్టి రాజులమ్మ, అనంతలక్ష్మి తమ జిరాయితీ భూములు 22ఎ లో తప్పుడుగా రికార్డు అయ్యాయని, దీంతో తాము అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్నామని బుధవారం నాటి స్పందనలో జిల్లా కలెక్టర్ కు ఆర్జీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన దీనిపై విచారణకు అసిస్టెంట్ కలెక్టర్ రికార్డులన్నీ పరిశీలించారు. నివేదికను జిల్లా కలెక్టర్ సమర్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మహేశ్వరరావు, ఆర్‌ఐ చినబ్బాయి పాల్గొన్నారు.